ఏపీలో హైవేపై అదుపుతప్పి పల్టీలు కొట్టిన పెట్రోల్ ట్యాంకర్..

ఏపీలో హైవేపై అదుపుతప్పి పల్టీలు కొట్టిన పెట్రోల్ ట్యాంకర్..

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు దగ్గర  జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.   కడప నుంచి గుంటూరు వెళ్తున్న పెట్రోల్​ ట్యాంకర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది.  ట్యాంకర్​ లో 10  వేల లీటర్ల పెట్రోల్​.. నాలుగు వేల  లీటర్లు డీజిల్​ ఉంది.  డ్రైవర్​ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. 

ఈ ప్రమాదంతో ట్రాఫిక్​ కు అంతరాయం కలిగింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్​ ను క్రమబద్దీకరించారు. ప్రమాద ఘటనపైఆరా తీస్తున్నారు.